‘క‌ల్కి’ OST పై అప్డేట్ ఇచ్చిన మేక‌ర్స్

‘క‌ల్కి’ OST పై అప్డేట్ ఇచ్చిన మేక‌ర్స్

Published on Jul 8, 2024 7:12 PM IST

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కించ‌గా మైథాల‌జీ సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ ఆడియెన్స్ ను మెస్మ‌రైజ్ చేసింది. ఇక ఈ సినిమాలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న‌దైన ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

‘క‌ల్కి’ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ అందించిన సంగీతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాట‌లు ఆడియెన్స్ కు బాగా న‌చ్చాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన OST ని జూలై 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక అప్డేట్ కూడా ఇచ్చారు.

ప్ర‌భాస్ స‌రికొత్త లుక్ లో న‌టించిన ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. దుల్క‌ర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు కేమియో పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై సి.అశ్వినీద‌త్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు