“రాబిన్‌హుడ్‌” సెట్స్ నుండి ఫన్నీ వీడియోను రిలీజ్ చేసిన డైరెక్టర్!

“రాబిన్‌హుడ్‌” సెట్స్ నుండి ఫన్నీ వీడియోను రిలీజ్ చేసిన డైరెక్టర్!

Published on Jul 11, 2024 7:02 PM IST

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్‌. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా సెట్స్ నుండి డైరెక్టర్ వెంకీ కుడుముల ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది.

ఈ వీడియోలో హీరో నితిన్ వృద్దుడు గా కనిపిస్తున్నాడు. శ్రీ లీల చాలా అందంగా వీడియోలో ఉంది. పాతికేళ్ల తర్వాత రాబిన్ హుడ్ అంటూ వీడియోలో డైరెక్టర్ కామెంట్స్ చేయడం మనం చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంకు సంబందించిన వరుస అప్డేట్స్ ను కూడా త్వరలో ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు