“భారతీయుడు 2” లో రెహమాన్ ఇండియన్ 1 మ్యూజిక్ థీమ్స్!

“భారతీయుడు 2” లో రెహమాన్ ఇండియన్ 1 మ్యూజిక్ థీమ్స్!

Published on Jul 12, 2024 1:00 AM IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు2. ఈ చిత్రం కొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ వెబ్ థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ హీరో సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంకు సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇక్కడ ఉంది.

ఈ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇండియన్ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందించారు. ఈ సీక్వెల్ కు రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. అయితే భారతీయుడు 2 లో రెహమాన్ ఇండియన్ కోసం చేసిన మ్యూజిక్ థీమ్స్ అనిరుద్ తో చేయించినట్లు డైరెక్టర్ శంకర్ కన్ఫర్మ్ చేశారు. ఇది ఫ్యాన్స్ కు సిసలైన ట్రీట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు