చ‌రిత్ర సృష్టించిన ”మిర్జాపూర్-3”

చ‌రిత్ర సృష్టించిన ”మిర్జాపూర్-3”

Published on Jul 12, 2024 7:36 PM IST

ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఇటీవ‌ల స్ట్రీమింగ్ కి వ‌చ్చిన మిర్జాపూర్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ కోసం ప్రేక్ష‌కులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అలాంటిది మ‌రి. ఇక ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వ‌చ్చిందో లేదో అప్పుడే రికార్డుల మోత మోగిస్తోంది.

మిర్జాపూర్-3 వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసిన వీకెండ్ లో(జూలై 5-7) ఈ షోను ఏకంగా 180 దేశాల్లోని ప్రైమ్ యూజ‌ర్లు వీక్షించిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేగాక‌, భార‌త్ లోని 98 శాతం పిన్ కోడ్ ఉన్న ప్రాంతాల్లో ఈ వెబ్ సిరీస్ ను వీక్షించినట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు.

దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో చ‌రిత్ర‌లోనే ఇంత భారీస్థాయిలో ఓ వెబ్ సిరీస్ ను వీక్షించ‌డం మిర్జాపూర్-3 సొంతం అని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇక ఈ యునానిమ‌స్ రెస్పాన్స్ తో ఈ వెబ్ సిరీస్ 4వ ఎడిష‌న్ ను కూడా రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారు మేక‌ర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు