ఆగస్ట్ 3న అడివి శేష్ “G2” అప్డేట్!

ఆగస్ట్ 3న అడివి శేష్ “G2” అప్డేట్!

Published on Jul 12, 2024 8:30 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ G2 (గూఢచారి 2). ఈ చిత్రం 2018 లో రిలీజైన గూఢచారి మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కి సంబందించిన అప్డేట్ పై హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదిక గా రెస్పాండ్ అయ్యారు. ఆగస్ట్ 3 వ తేదీన G2 అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటుగా, డెకాయిట్ చిత్రంలో కూడా నటిస్తున్నారు అడివి శేష్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు