హాట్ టాపిక్ గా ఐశ్వర్యరాయ్ సోలో ప్రెజెన్స్.!

హాట్ టాపిక్ గా ఐశ్వర్యరాయ్ సోలో ప్రెజెన్స్.!

Published on Jul 13, 2024 12:11 PM IST


బాలీవుడ్ టాప్ అండ్ సీనియర్ హీరోయిన్స్ లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం మానేసింది. ఇలా తన బచ్చన్ ఫ్యామిలీతో నే బిజీగా గడుపుతుంది. అయితే ఐష్ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

నిన్న వీరి కుటుంబం అంబానీ ఫ్యామిలీ పెళ్ళికి కూడా హాజరయ్యారు. కానీ ఈ పెళ్ళిలో అమితాబ్ కుటుంబం అంతా కలిసి కనిపిస్తుంది అనుకుంటే అందులో ఐశ్వర్య రాయ్ ఇంకా తన కూతురు ఆరాధ్యలు వేరే వేరేగా కనిపించడం ఆశ్చర్యంగా మారింది. అభిషేక్, అమితాబ్ సహా తన భార్య తదితర కుటుంబీకులు ఒక పిక్ లో కనిపిస్తే ఐశ్వర్య మరియు తన కూతరు ఆరాధ్యలు వేరేగా హాజరయ్యారు.

దీనితో ఒకే కుటుంబం అయినటువంటి వీరు ఇలా విడిగా రావడం అనేది సోషల్ మీడియాలో అలాగే బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఐష్ ఎందుకు సోలోగా వచ్చిందో అనేది అసలు కారణం ఇంకా రివీల్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు