మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ”మిస్టర్ బచ్చన్”ను రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమాను దర్శుకడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా తరువాత రవితేజ తన కెరీర్ లోని 75వ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. అయితే, ఈ సినిమా తరువాత మరోసారి తనకు ‘పవర్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేసేందుకు రవితేజ సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్న బాబీ, మరో స్క్రిప్టును రెడీ చేశాడట.
ఈ స్క్రిప్టును రవితేజకు వినిపించాలని బాబీ ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రవితేజ ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అని తెలుస్తోంది. మరి రవితేజతో మరోసారి బాబీ తన ‘పవర్’ చూపెడతాడా అనేది వేచి చూడాలి.