‘క్యాస్టింగ్‌ కౌచ్’‌ పై మరో హీరోయిన్ స్పందన

‘క్యాస్టింగ్‌ కౌచ్’‌ పై మరో హీరోయిన్ స్పందన

Published on Jul 14, 2024 3:42 PM IST

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ ఎస్తర్‌ నోరోన్హా కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ చాలా బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, ఎస్తర్‌ నోరోన్హా ఏం మాట్లాడారు అంటే.. ఆమె మాటల్లోనే.. ఇండస్ట్రీలో ఎదగాలంటే షార్ట్ కట్ క్యాస్టింగ్‌ కౌచే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి దేనికైనా సిద్ధమైతే మాత్రం, కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకుంటారు.

ఎస్తర్‌ నోరోన్హా ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. ‘ఛాన్స్ ల కోసం ఏదైనా చేస్తాను.. ఎంత దూరమైనా వెళ్తాను’ అని అనుకునేవారు కూడా ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అలాంటి వారిని కొంతమంది లోబరుచుకుంటారు. దీనికితోడు, సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మరో కారణం’ ఆమె చెప్పారు.

ఇక తాను ఎప్పుడూ అలాంటివి చేయలేదని, చాలా మంది టాలెంట్ ను నమ్ముకొని కూడా ముందుకు వెళ్తున్నారు అని.. తాను కూడా తన టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుని కెరీర్ ను కొనసాగిస్తున్నాను’ అని ఎస్తర్‌ నోరోన్హా చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు