సర్ప్రైజ్: ముందే ఓటీటీలోకి వచ్చేసిన “హరోం హర”

సర్ప్రైజ్: ముందే ఓటీటీలోకి వచ్చేసిన “హరోం హర”

Published on Jul 16, 2024 2:30 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవ దలఁపత్ సుధీర్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాల్వికా శర్మ హీరోయిన్ గా దర్శకుడు జ్ఞ్యాన సాగర్ ద్వారక తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ డ్రామానే “హరోం హర”. మరి ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటిటి రిలీజ్ విషయం మాత్రం మంచి సస్పెన్స్ గానే మారింది అని చెప్పాలి. ఈ సినిమా హక్కులు రెండు స్ట్రీమింగ్ యాప్స్ ఆహా, ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అది ముందు ఒక డేట్ ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి వాయిదా పడి ఆ తర్వాత మరో డేట్ ని లాక్ చేసుకుంది.

అలా జూలై 18న ఈటీవీ విన్ లో రావాల్సిన ఈ సినిమా ముందుగా నిన్న ఆహా లో వచ్చేసింది. ఇక ఇప్పుడు మరింత సర్ప్రైజింగ్ గా ఈటీవీ విన్ లో 18 కాకుండా నేడు 16 నుంచే అందుబాటులోకి వచ్చేసినట్టుగా వారు ప్రకటించేసారు. దీనితో అనుకున్న డేట్ కంటే ముందే సినిమా వచ్చేసింది అని చెప్పాలి. మరి అప్పుడు మిస్ అయ్యిన వారు ఈ చిత్రాన్ని ఇపుడు చూడాలి అనుకుంటే ఈటీవీ విన్ లో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సాలిడ్ మ్యూజిక్ వర్క్ ని అందించగా సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు