గాయాలతో నవీన్ పొలిశెట్టి.. సమయం పడుతుందన్న హీరో!

గాయాలతో నవీన్ పొలిశెట్టి.. సమయం పడుతుందన్న హీరో!

Published on Jul 17, 2024 2:01 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తనదైన యాక్టింగ్, తనదైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ విజయాలను అందుకోవడంతో, ఆయన నటించే నెక్ట్స్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, నవీన్ పొలిశెట్టి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడు. దీనికి గల కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించాడు.

తాను ఇటీవల గాయాలపాలయ్యానని చెప్పుకొచ్చిన నవీన్, తన చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినట్లు తెలిపాడు. అంతేగాక, తన కాలికి కూడా తీవ్ర గాయమైందని.. ఇది చాలా కఠినమైన సమయం అని.. తనకు ఎంతో ఇష్టమైన షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తుందని నవీన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను నెమ్మదిగా రికవర్ అవుతున్నానని.. వైద్యుల పర్యవేక్షణలో రికవర్ కావడానికి మరింత సమయం పడుతుందని ఆయన తెలిపాడు. చాలా గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని.. గాయాల నుండి రికవర్ అయ్యాక తన నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటానని నవీన్ తెలిపాడు.

అభిమానులు చూపిస్తున్న ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని నవీన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు నవీన్‌కి ఏమైందా అని వారు ఆరా తీస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు