పీపుల్ స్టార్ గా విప్లవాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆర్. నారాయణ మూర్తి. ఆయన సినిమా వచ్చిందంటే మాస్ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అడపాదడపా కొన్ని సినిమాల్లో నటిస్తూ సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, తాజాగా ఆర్. నారాయణ మూర్తి అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఈ వార్తతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఉలిక్కిపడ్డారు. నారాయణ మూర్తి స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని వారు పరిశీలిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.