కోలీవుడ్ ప్రముఖ నటుడు శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అమరన్. ఇండియన్ ఆర్మీ రాజ్పుత్ రెజిమెంట్లో ఆఫీసర్ అయిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ముకుంద్ వరదరాజన్ కు మరణానంతరం అశోక చక్రను ప్రదానం చేశారు. గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.
దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని వెల్లడించడానికి మేకర్స్ శివకార్తికేయన్ యొక్క పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. రంగూన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ మరియు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.