IIFA ఉత్సవం తరపున చిరంజీవికి మరో గౌరవం!

IIFA ఉత్సవం తరపున చిరంజీవికి మరో గౌరవం!

Published on Jul 17, 2024 8:23 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు పురస్కారం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఎంత ఎత్తుకి ఎదిగారు అనేది వీటిని చూసే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి మరో గౌరవం దక్కింది అని చెప్పాలి. IIFA ఉత్సవం 2024 కి గానూ, “ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా” గౌరవాన్ని అందుకోనున్నారు. ఇది అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే, గతేడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా, మరొక చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే ఫాంటసీ చిత్రం లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 న థియేటర్ల లోకి రానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం లో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు