రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ ‘తంగ‌లాన్’

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న‌ ‘తంగ‌లాన్’

Published on Jul 19, 2024 4:32 PM IST

త‌మిళ నటుడు చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘తంగ‌లాన్’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండ‌స్ట్రీల్లో ఈ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్స్ ఉండ‌టంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఈ పీరియాడిక్ ఎపిక్ డ్రామాను ఆగ‌స్టు 15న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో విక్ర‌మ్ ఓ ట్రైబ‌ల్ అవ‌తారంలో క‌నిపిస్తుండ‌టంతో ఈ సినిమాలో ఆయ‌న ఎలాంటి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారా అనే ఆసక్తి అంద‌రిలో నెల‌కొంది.

ఇక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌ను హ్యాండిల్ చేయ‌డంలో దిట్ట అయిన పా రంజిత్, తంగ‌లాన్ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడా అనే ఆస‌క్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, పార్వ‌తి తిరువొతు, ప‌శుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. జివి.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్, నీల‌మ్ ప్రొడ‌క్ష‌న్స్, జియో స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు