నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘సరిపోదా శనివారం’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తరువాత నాని నటించబోయే సినిమాలపై సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని ఓ సినిమా చేయనున్నాడు. అయితే, ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు నిర్మాతలు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ‘దసరా’ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, అది భారీ వసూళ్లను రాబట్టింది.
దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో, ఈసారి ఏకంగా రూ.100 కోట్లతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ మూవీగా నిలవనుంది. దీంతో నాని అభిమానులు ఈ సినిమా ఎలాంటి కథతో రానుందా అనే ఆసక్తి నెలకొంది.