మహేష్ బర్త్ డే స్పెషల్ గా “ఒక్కడు” స్పెషల్ షోస్!

మహేష్ బర్త్ డే స్పెషల్ గా “ఒక్కడు” స్పెషల్ షోస్!

Published on Jul 22, 2024 9:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషంగా అలరించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి చిత్రం కోసం రెడీ అవుతున్నారు మహేష్. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఇప్పటికే మురారి చిత్రం 4కె లో రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. మరొక పక్క మహేష్ ఒక్కడు చిత్రం స్పెషల్ షోస్ కన్ఫర్మ్ అయ్యాయి. ఆగస్ట్ 8 వ తేదీన కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు