గేమ్ చేంజర్ లో మొత్తం ఏడు పాటలున్నాయి – థమన్

గేమ్ చేంజర్ లో మొత్తం ఏడు పాటలున్నాయి – థమన్

Published on Jul 23, 2024 9:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించారు.

సెకండ్ సింగిల్ గా, ఏ సాంగ్ ను రిలీజ్ చేస్తామో తెలీదు అంటూ థమన్ వెల్లడించారు. అంతేకాక ఆగస్ట్ ఎండింగ్ నుండి సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంను డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రంలో అంజలి, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు