ప్రముఖ సంస్థకి “మెకానిక్ రాకీ” ఆడియో హక్కులు..!

ప్రముఖ సంస్థకి “మెకానిక్ రాకీ” ఆడియో హక్కులు..!

Published on Jul 25, 2024 2:34 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మినిమమ్ గ్యారెంటీ హీరోస్ లో యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి తన లాస్ట్ చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమాతో బ్రేకీవెన్ కొట్టేసాడు. దీనితో ఈ ఏడాదిలో రెండో హిట్ ని తాను అందుకోగా మళ్ళీ ఈ ఏడాదిలోనే మూడో సినిమాతో అయితే తాను రాబోతున్నాడు. ఆ చిత్రమే “మెకానిక్ రాకీ”.

దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ పై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కులని ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సంస్థ సోనీ మ్యూజిక్ సౌత్ వారు సొంతం చేసుకున్నట్టుగా రివీల్ చేశారు.

మరి ఈ సాంగ్స్ అయితే సోనీ మ్యూజిక్ నుంచి వినబోతున్నామని చెప్పాలి. ఇక ఈ సినిమాకి యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ట్యూన్స్ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ చిత్రం రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు