సమీక్ష : “రాయన్” – ప‌ర్వాలేద‌నిపించే మాస్ డ్రామా

సమీక్ష : “రాయన్” – ప‌ర్వాలేద‌నిపించే మాస్ డ్రామా

Published on Jul 27, 2024 3:02 AM IST
Raayan Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 26, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు జైరాం, అపర్ణ బాలమురళి, ఎస్ జే సూర్య, శరవణన్ తదితరులు.

దర్శకులు: ధనుష్

నిర్మాతలు : సన్ పిక్చర్స్

సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్

ఎడిట‌ర్ : ప్రసన్న జీకే

సంబంధిత లింక్స్: ట్రైలర్

కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా తన కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 50వ సినిమాగా చేసిన చిత్రమే “రాయన్”. మరి ధనుష్ దర్శకత్వం విషయంలో చాలా మంది నమ్మకం పెట్టుకొని ఎదురు చూసిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథలోకి వస్తే.. కార్తవ రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు ముత్తు రాయన్ (సందీప్ కిషన్), మాణిక్య రాయన్ (కాళిదాసు జైరాం) లు తన చెల్లెలు పసి పాప దుర్గ (దుషర విజయన్) తో చెన్నై లోని అంజనాపురంకి తమ చిన్న వయసులో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ తో వచ్చేస్తారు. అలాగే కార్తవ కి తన చెల్లెలు అంటే ఎంతో ప్రేమ తన కోసం ఎంతవరకు అయినా తెగిస్తాడు. మరి అంజపురంలో శేఖర్ (సెల్వ రాఘవన్) చేరదీస్తాడు కానీ తన కష్టార్జితంతోనే కార్తవ తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలిని సాకి పెద్ద వాళ్ళని చేస్తాడు. కానీ అక్కడే ఉంటున్న ఇద్దరు లోకల్ డాన్ లు సేతురామన్ (ఎస్ జే సూర్య), దురై (శరవణన్) ల మధ్య పవర్ వార్ జరుగుతూ ఉంటుంది. దీనితో వీరి మధ్యలోకి రాయన్ రావడానికి కలిగిన పరిస్థితులు ఏంటి? తన తమ్ముళ్లే రాయన్ కి ఎలా ఎదురు తిరగాల్సి వస్తుంది? అక్కడ నుంచి కార్తవ ఏం చేస్తాడు? వీరందరిలో అక్కడ క్రైమ్ ని ఆపేందుకు వచ్చిన పోలీస్ (ప్రకాష్ రాజ్) ఏం చేస్తాడు? చివరికి ఏమవుతుంది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో మొదటిగా నటీనటుల పెర్ఫామెన్స్ ల కోసం మాట్లాడినట్టు అయితే ధనుష్ ప్రతి ఒక్క నటీనటుడికి పర్ఫెక్ట్ రోల్స్ ని అందించాడు అని చెప్పాలి. కార్తవ రాయన్ గా తన పాత్ర నుంచి పోలీస్ పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్ వరకు సాలిడ్ కాస్టింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమా కార్తవ రాయన్ గా ధనుష్ మరోసారి తనలోని వెర్సటాలిటీ ప్రదర్శించాడు అని చెప్పాలి. పలు ఎమోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ తన మార్క్ మాస్ తో చేసి చూపించడం బాగుంది.

అలాగే యంగ్ హీరో సందీప్ కిషన్ కి ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. తన పాత్రని సందీప్ చాలా నాచురల్ గా చేసేసాడు. ఇంకా కాళిదాసు జైరాం విక్రమ్ తర్వాత ఈ సినిమాలో డీసెంట్ పెర్ఫామెన్స్ ని ప్రదర్శించడు. అయితే వీరితో పాటుగా తన చెల్లెలి పాత్రలో చేసిన నటి దుషర విజయన్ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని చెప్పాలి. ఆమె తన రోల్ లో అదరగొట్టేసింది. ఆమె పై కొన్ని మాస్ సీన్స్ కూడా బాగున్నాయి.

ఇంకా విలన్స్ గా కనిపించిన ఎస్ జే సూర్య శరవణన్ లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. ఇంకా నటి అపర్ణ బాలమురళి సందీప్ కి జోడిగా మంచి నటన కనబరిచింది. వీరితో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్, దివ్య పిళ్ళై తదితరులు తమ రోల్స్ లో డీసెంట్ గా కనిపించారు. అలాగే డీసెంట్ గా సాగే కథనం పాటలు, రెహమాన్ స్కోర్ తో సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో నిరుత్సాహపరిచే అంశాలు కూడా బాగానే ఉంటాయని చెప్పాలి. మెయిన్ గా ధనుష్ దగ్గర బలమైన కథ లేదు. మాస్ లో అందరికీ బాగా తెలిసిన లైన్ తోనే సినిమా మొత్తం నడిపిస్తాడు. దీంతో ఈ సినిమా పట్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎగ్జైట్మెంట్ పెద్దగా కనిపించదు. అలాగే చాలా సన్నివేశాలు మనం ఇది వరకే ఎన్నో సినిమాలలో చూసినట్టే అనిపిస్తుంది.

మన తెలుగు తమిళ్ లో కూడా పలు సినిమాలు లక్ష్మి, నారప్ప ఒరిజినల్ ధనుష్ సినిమా అసురన్ లాంటివే గుర్తొస్తాయి. వీటితో సినిమా రొటీన్ రెగ్యులర్ మాస్ సినిమా లానే అనిపిస్తుంది. ఇంకా మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ లు లాంటివి కూడా సినిమాలో లేవు. ఇంకా ఎస్ జే సూర్య, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి నటుల పాత్రలు ఇంకా బలంగా చూపించాల్సింది. ఇలా స్ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నైతే ఉన్నాయో ఆకట్టుకోని అంశాలు కూడా అన్నే కనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కేర్ కూడా బాగా తీసుకున్నారు. ఇక టెక్నీకల్ టీం లో రెహమాన్ తన పని చూసుకున్నారు. మంచి సాంగ్స్ కొన్ని సీన్స్ లో సాలిడ్ రీ రికార్డింగ్ తో అదరగొట్టారు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు.

ఇక దర్శకుడు ధనుష్ విషయానికి వస్తే.. తను ఈ సినిమాకు నటుడిగా పూర్తి స్థాయి న్యాయం చేశాడు కానీ దర్శకుడుగా మాత్రం ఈసారి తన బెంచ్ మార్క్ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చెయ్యలేదు. రొటీన్ లైన్ నే తీసుకున్నాడు కానీ దానిని మాత్రం అంత బోర్ కొట్టించకుండా హ్యాండిల్ చేయడం మాత్రం బాగానే ఉంది. ఇంకా నటీనటులు ఎంపిక కూడా బాగుంది కానీ స్క్రీన్ ప్లే ని ఇంకాస్త ఎంగేజింగ్ గా మార్చి ఉంటే బాగుండేది. దీనితో దర్శకునిగా ఈ సినిమాకి తన వర్క్ యావరేజ్ గానే ఉంటుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ధనుష్ నుంచి తన స్వీయ దర్శకత్వంలో అది కూడా తన 50వ సినిమాగా వచ్చిన ఈ “రాయన్” సినిమాలో మెప్పించే అంశాలు ఎన్నైతే ఉన్నాయో నొప్పించే అంశాలు కూడా అలానే ఉన్నాయి. కాకపోతే ధనుష్ ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనం నడిపించిన విధానం సినిమాని సేఫ్ చేస్తుంది. కొంచెం రొటీన్ లైన్ అయినా పర్వాలేదు ధనుష్ నుంచి ఒక డీసెంట్ మాస్ సినిమా చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ఒక్కసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు