ఫోటో మూమెంట్: “కల్కి” సెట్స్ నుంచి పాజిటివ్ మథర్..

ఫోటో మూమెంట్: “కల్కి” సెట్స్ నుంచి పాజిటివ్ మథర్..

Published on Jul 26, 2024 7:11 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నటి దీపికా పడుకోణ్ అలాగే యంగ్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లతో దుమ్ము లేపిన ఈ చిత్రం మన తెలుగు సినిమా నుంచి రెండో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచే దిశగా దూసుకెళ్తుంది.

అయితే సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని అందిస్తూ వస్తున్నారు. అలా తాజాగా బాలీవుడ్ నటి దీపికా పడుకోణ్ పై సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఒక పాజిటివ్ మథర్ అంటూ ఆమెపై సెట్స్ లో తెరకెక్కిస్తున్న సీన్ నుంచి ఓ పిక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆమె నవ్వుతూ సినిమా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

దీనితో ఈ బ్యూటిఫుల్ పిక్ మంచి మూమెంట్ గా మారింది. ఇలా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ భారీ చిత్రంలో అమితాబ్, కమల్ లాంటి దిగ్గజాలు కూడా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు