“థగ్ లైఫ్” కి డబ్బింగ్ షురూ చేసిన శింబు!

“థగ్ లైఫ్” కి డబ్బింగ్ షురూ చేసిన శింబు!

Published on Jul 26, 2024 11:58 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థగ్ లైఫ్‌. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో శింబు మరొక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు షేర్ చేశారు.

ఈ చిత్రం కోసం శింబు డబ్బింగ్ వర్క్ ను షురూ చేశారు. ఇదే విషయాన్ని ఒక ఫోటో ద్వారా వెల్లడించారు. ఈ విషయం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థగ్ లైఫ్‌లో త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్ మరియు నాజర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ మరియు సన్యా మల్హోత్రా కూడా ఈ ఎంటర్‌టైనర్‌లో భాగమని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు