అఫీషియల్: “మిస్టర్ బచ్చన్” కి స్పెషల్ ప్రీమియర్స్

అఫీషియల్: “మిస్టర్ బచ్చన్” కి స్పెషల్ ప్రీమియర్స్

Published on Jul 27, 2024 11:00 AM IST

మన టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేసిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “మిస్టర్ బచ్చన్”. సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టీజర్ కట్ ని హరీష్ శంకర్ లేటెస్ట్ గానే లాక్ చేసేసాడు. అయితే గత కొన్ని రోజులు నుంచి మిస్టర్ బచ్చన్ స్పెషల్ ప్రీమియర్స్ ఉండబోతున్నట్టుగా బజ్ ఈ సినిమా చుట్టూతా తిరిగింది.

మరి దీనిపై మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ మధ్యాహ్నం టీజర్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని తెలుపుతూ సినిమా గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15న ముందు రోజు ఆగస్ట్ 14న స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నామని కన్ఫర్మ్ చేసేసారు. దీనితో యూఎస్ మార్కెట్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా మిస్టర్ బచ్చన్ స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు