ఆ విషయంలో నేనెంతో బాధపడ్డా – రణ్‌ బీర్‌ కపూర్‌

ఆ విషయంలో నేనెంతో బాధపడ్డా – రణ్‌ బీర్‌ కపూర్‌

Published on Jul 28, 2024 3:00 PM IST

బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ, రణ్‌బీర్‌ కపూర్‌ ఏం మాట్లాడారు అంటే.. ‘నాకు బాగా గుర్తు. నా చిన్న తనంలో మా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. అమ్మానాన్న ఏదో ఒక విషయంలో నిత్యం తిట్టుకునేవాళ్లు. ఆ సమయంలో నేను బాగా ఇబ్బంది పడ్డాను’ అని రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు.

రణ్‌బీర్‌ కపూర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక్కోసారి మా పేరెంట్స్ కేకలు వినలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి మెట్లపై కూర్చొని ఏడ్చే వాడ్ని. కొన్నిసార్లు అమ్మ తన బాధను నాతో పంచుకునేది. మా నాన్న మాత్రం అలా కాదు. ఆయన ఎవరితో ఏం చెప్పరు. తన భావాల్ని ఆయన ఎవరితో ఎప్పుడూ షేర్‌ చేసుకోరు. ఆయన ఎందుకు అలా ఉంటారో నాకు అర్థమయ్యేది కాదు. ఏది ఏమైనా మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. భయం కూడా. ఆయన చనిపోయే రోజు నా గుండె బరువెక్కింది’ అని రణ్‌బీర్‌ కపూర్‌ ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు