“కుబేర” నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్!

“కుబేర” నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్!

Published on Jul 28, 2024 11:00 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం రాయన్ థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ రోజు అతని పుట్టినరోజ సందర్భంగా కుబేర మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. పోస్టర్ లో ధనుష్ లుక్ ఆడియెన్స్ ను అలరిస్తుంది. అభిమానులకి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కుబేర చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తుండగా, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మరియు జిమ్ సర్భ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ కుబేర తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు