ప్రముఖ నటుడు సముద్ర ఖని మరియు కమెడియన్ ధన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రామం రాఘవం. తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ధన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, సత్య, మోక్ష సేన్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వీ పొలవరపు నిర్మించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.