పుష్ప-2 లీక్స్ పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు

పుష్ప-2 లీక్స్ పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు

Published on Aug 1, 2024 8:00 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప-2 ది రూల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లీక్ అయ్యింది. మరోసారి యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన ఒక వీడియో కూడా లీక్ అయ్యింది.

అభిమానుల్లో ఒకరు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. క్లిప్‌లో అల్లు అర్జున్, రష్మిక మరియు ఫహాద్ ఫాజిల్‌లు తాడుపై ఉన్న క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ చేయడం చూపిస్తుంది. ఇది సినిమాలో క్లైమాక్స్ సీన్ అని పలువురు అంటున్నారు. అభిమానులు ఈ లీక్స్‌తో సంతోషంగా లేరని.. ఇలాంటి లీక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని మేకర్స్‌ను కోరారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు