కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి వరదలు రావడంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారికి అండగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు. టాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు వయనాడ్ బాధితులకు తమవంతుగా సహాయం అందిస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితుల సహాయర్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. ప్రకృతి విపత్తు కారణంగా అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. వారికి అందరూ తమవంతు సాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చాడు.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు వయనాడ్ బాధితుల కోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరాడు.