ఇంటర్వ్యూ: ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి – డైరెక్టర్ యదు వంశీ

ఇంటర్వ్యూ: ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి – డైరెక్టర్ యదు వంశీ

Published on Aug 7, 2024 9:04 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్ఫణలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా సాలిడ్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని యదు వంశీ డైరెక్ట్ చేశారు. పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను దర్శకుడు యదు వంశీ మీడియాతో చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

* మా ఊరిలో జరిగే జాతర నేపథ్యంలో ఓ కథ రాసుకున్నాను. ఈ కథను వినిపించాలని చాలా ప్రొడక్షన్ కంపెనీలు తిరిగాను. చివరకు నిహారిక గారు ఈ కథకు ఓకే చెప్పారు.

* తెరపై సినిమా ఎలా ఉండాలనేది నిహారిక గారికి తెలుసు. దీంతో, ఆమె ఈ సినిమాకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. సినిమా తీయడంలో పూర్తి ఫ్రీడం ఇచ్చారు.

* ఇందులో ప్రతీ పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను. ప్రసాద్ ఒక్కడే కాస్త తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించాడు.

* రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంతో ఈ కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాష్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని మాటల స్పూర్తితోనే ఈ సినిమాలోని కొన్ని సీన్లను రాసుకున్నాను.

* సెట్‌లో అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని వర్క్‌షాప్స్ ఎక్కువగా చేశాను. చిరంజీవి గారు సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ గారు చూసి 11 మంది ఇరగ్గొట్టేశారని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది.

* కోనసీమలోని అందాన్ని మరింత అందంగా చూపించాం. ఈ సినిమాకు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలోకి తీసుకెళ్లగలిగాం. అనుదీప్ పాటలు అందరినీ మెప్పించాయి.

* ఈ సినిమా తరువాత ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. ఈ మూవీ పెద్ద హిట్ అయితే, నేను అనుకున్న హీరోతో ఆ సినిమా చేస్తాను.

* ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తాం. ఈ సినిమాను థియేటర్లలో చూడాలి. అప్పుడే సినిమాలోని అన్ని ఎమోషన్స్‌ను అనుభూతి చెందుతారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు