నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “సరిపోదా శనివారం”. మరి నాని కెరీర్ లో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని ఆల్రెడీ టాక్ ఉంది. సినిమా స్టార్ట్ అయ్యిన మొదట్లోనే సుమారు 90 కోట్లకు పైగానే అన్నట్టు టాక్ వచ్చింది.
కానీ ఇప్పుడు ఈ నెంబర్ కూడా పెరిగినట్టు బయటకి వచ్చింది. ఈ సినిమాకి ఏకంగా బడ్జెట్ 150 కోట్లు అయ్యింది అని ఎస్ జె సూర్య రీసెంట్ ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇది మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. మరి ఇంత బడ్జెట్ పెట్టేంత సినిమాలో ఏముందో చూడాలి.. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతోంది.