నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘NTR31’ని సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తాజాగా పట్టాలెక్కించారు చిత్ర యూనిట్.
కేజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌పై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడట ఈ డైరెక్టర్. కాగా, ఈ సినిమాను నేడు అఫీషియల్‌గా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హర్షిత్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో కనిపించారు. ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.