బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈనెల 14న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించబోతుంది.
అలాగే, మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అన్నట్టు ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. అన్నట్టు బీజీపీ పార్టీ నుంచి కంగనా భాజపా ఎంపీగా గెలిచింది. ఈ క్రమంలో ఆమె ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా సినిమా చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ సినిమాలో ఇందిరా గాంధీని అవమానించే విధంగా సన్నివేశాలు ఉంటే తగిన బుద్ధి చెబుతాం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్ట్ లు పెడుతున్నారు.