సినిమాలు చూసి మారుతారని నేను అనుకోను – హరీష్ శంకర్

సినిమాలు చూసి మారుతారని నేను అనుకోను – హరీష్ శంకర్

Published on Aug 14, 2024 11:35 AM IST

మాస్ రాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ మీడియాతో ముచ్చటించారు.

ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు చూసి జనం మారుతారంటే తాను ఒప్పుకోనని అన్నారు. అలా మారుతారంటే ‘గాంధీ’ సినిమా చూసి అందరూ మహాత్మా గాంధీలే అవుతారు. ‘పుష్ప’ సినిమా చూసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తిరుపతి అడవులకి వెళ్లి స్మగ్లింగ్ చేయట్లేదుగా. సినిమా ప్రభావం ప్రజలపై కొన్ని గంటల వరకు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తనవరకు సినిమా కేవలం వినోదం పంచేందుకేనని అన్నారు.

ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా ‘పుష్ప’ సినిమాపై సెటైర్లు వేశారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా సాగడంతో, ఇప్పుడు హరీష్ శంకర్ కూడా పరోక్షంగా ఆ వ్యాఖ్యలను ఖండించారని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఓ సినిమాను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మాత్రమే ప్రజలు చూస్తారని హరీష్ తన కామెంట్స్‌ను సమర్ధించుకు వచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు