బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ వరుస షోలతో ఎంత బిజీగా ఉంటుందో మనకు తెలుసు. ఆమె బుల్లితెరపై పలు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే, తన కో-యాంకర్ సుధీర్‌తో ఆమెకి ఎఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో చాలాసార్లు పుకార్లు వినిపించాయి. తాజాగా వాటన్నింటికి ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంతేగాక, మరో యాంకర్ ప్రదీప్‌కి ముద్దు పెట్టి సుధీర్‌కి వార్నింగ్ ఇస్తానంటోంది ఈ బ్యూటీ.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.. తాజాగా రష్మీ గౌతమ్ ఓ చిట్ చాట్ ప్రోగ్రాంలో పాల్గొంది. ముద్దు, వార్నింగ్, చెంపదెబ్బ.. ఈ మూడింటిలో సుధీర్, ప్రదీప్, ఆదిలలో ఎవరెవరికి ఏది ఇస్తారని ఆమెను అడగ్గా.. తనను బాగా విసిగించే ఆదికి చెంపదెబ్బ.. ప్రదీప్‌కి ముద్దు.. సుధీర్‌కి వార్నింగ్ ఇస్తానంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ఇక రష్మీ చెప్పిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ కింది వీడియోలో చూడండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి