కన్ఫమ్ : వార్ నేపథ్యంలో ప్రభాస్-హను మూవీ

కన్ఫమ్ : వార్ నేపథ్యంలో ప్రభాస్-హను మూవీ

Published on Aug 17, 2024 4:55 PM IST

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ తరుణంలో ఈ సినిమా నేపథ్యం ఏమిటో చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. 1940ల నేపథ్యంలో యుద్ధాలు ఆధిపత్యం కోసం జరుగుతుంటే.. ఒక్క యోధుడు మాత్రం ప్రేమ కోసం యుద్ధం చేస్తాడు.. ఈ కాన్సెప్ట్‌లో సినిమా రాబోతుందని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు వారు క్లూ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే, ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌నే మేకర్స్ ఫిక్స్ చేస్తారేమో అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో ఇమాన్ ఇస్మాయిల్(ఇమాన్వి) హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. కృష్ణకాంత్ సాహిత్యం, సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ, కమల్ కణ్ణన్ ఫైట్స్ ఈ సినిమాకు టెక్నికల్ బలాన్ని ఇవ్వనున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు