“మిస్టర్ బచ్చన్” పై అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడే ఎందుకు?

“మిస్టర్ బచ్చన్” పై అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడే ఎందుకు?

Published on Aug 19, 2024 12:02 AM IST

ఈ ఆగస్ట్ నెల స్వాతంత్ర దినోత్సవం కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం బాలీవుడ్ సినిమా “రైడ్” కి రీమేక్ గా చేసినప్పటికీ హరీష్ శంకర్ తన మార్క్ మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చారు.

అయితే ఈ సినిమా విషయంలో పరిణామాలు విడుదలకి ముందు ఒకలా విడుదల తర్వాత ఒకలా మారాయి అని చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో రీమేక్ సినిమాలకి ప్రేక్షకులు మొహం చాటేస్తున్నారు. ఎవరైనా స్టార్ హీరో రీమేక్ చేస్తున్నారు అని తెలిస్తే అది ఎలా ఉంటుంది అనేది కూడా చూడకుండా ముందు నుంచే ఆసక్తి తగ్గించేసుకుంటున్నారు. అది వాళ్ళ ఛాయిస్ నే కానీ ఇది రవితేజ, హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ కి కనిపించలేదు.

విడుదలకి ముందు అంతా కావాల్సినంత బజ్ వచ్చింది. రీమేక్ అనే మరకే పెద్దగా ఈ సినిమాకి కనిపించలేదు. దీనితో ఈ మధ్య కాలంలో అయితే రిలీజ్ రోజు వరకు ఓ రీమేక్ సినిమాకి అలాంటి టాక్ లేకుండా వచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి. పైగా భాగ్యశ్రీ ఫ్యాక్టర్ కి కూడా చాలా పాజిటివిటీ వచ్చింది. కానీ ఒక్కసారి రిలీజ్ అయ్యాక ఎందుకో ఈ సినిమా మీద విపరీతమైన నెగిటివిటీ కనిపించింది.

అందులో చాలా మంది సినిమా చూసిన వారు ఉన్నారో లేదో కూడా తెలీదు కానీ ఇంత నెగిటివిటీ కూడా ఈ మధ్య కాలంలో మరో సినిమా మీద రాలేదు ముఖ్యంగా సోషల్ మీడియాలో. మరి ఇది ప్లాన్డ్ గా జరిగిందా లేక నిజంగానే సినిమా నచ్చక జరిగిందా అంటే సినిమా మరీ అంత బాగోలేదు అని కూడా చెప్పడానికి లేదు. దాదాపు మిక్స్డ్ టాక్ నే చూసిన వారి నుంచి వచ్చింది.

ఇంకొందరు అయితే అసలు ఇంత నెగిటివ్ ఎందుకు వస్తుంది అని చూసిన వారు కూడా బాగానే ఉంది కదా మరీ ఇంతలా ఎందుకు చేస్తున్నారు అని అనుకోని వారు కూడా లేకపోలేరు. మరి ఈ సినిమా విషయంలో ఇంత పర్టిక్యులర్ గా జరగడం అనేది కొంచెం సస్పెన్స్ గానే అనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటి అనేది ఆ చేసే వాళ్ళకే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు