మోహన్‌లాల్‌ లేటెస్ట్ హెల్త్‌ అప్ డేట్

మోహన్‌లాల్‌ లేటెస్ట్ హెల్త్‌ అప్ డేట్

Published on Aug 19, 2024 12:28 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ అస్వస్థతకు గురి అయ్యి, కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఆయన హెల్త్‌ కు సంబంధించి ఆసుపత్రి వారు విడుదల చేసిన ప్రకటన వైరల్‌ అవుతోంది. ఆయన హై గ్రేడ్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. వైరల్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారని.. కాబట్టి ఐదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు మోహన్ లాల్ అభిమానులు తమ హీరోకి ఏ ప్రమాదం జరగకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అన్నట్టు మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘బరోజ్‌’ అక్టోబరు 3న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం మోహన్‌లాల్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోలుకున్నాక ప్రమోషన్స్ లో జాయిన్ అవుతాను అని మోహన్ లాల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు