మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ టాలీవుడ్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కడుతోంది. ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేయాలని చూస్తున్నారట. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ చిత్రం సెప్టెంబర్ 5న భారీస్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ వద్దనుకోవడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.
ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా జివి.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి నిజంగానే ‘లక్కీ భాస్కర్’ మూవీ రిలీజ్ డేట్ మారనుందా.. అనేది తెలియాల్సి ఉంది.