సాలిడ్ కంటెంట్ ఉంటే, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా బాక్సాఫీస్ వద్ద ఉండదు. కంటెంట్ తో మెప్పిస్తే థియేటర్ల కి క్యూ కడతారు ప్రేక్షకులు. గతవారం రిలీజైన ఆయ్ చిత్రం పరిస్థితి కూడా అంతే. పెద్ద చిత్రాలతో పాటుగా, కొన్ని పరిమిత థియేటర్ల లో రిలీజైన ఆయ్ చిత్రం మొదటి రోజు 62 లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది. కానీ, నాల్గో రోజుకి వచ్చే సరికి ఏకంగా 300 రెట్లు అధికంగా 2.2 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నార్నే నితిన్ మరియు నయన్ సారిక లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కి అంజి కే. మణిపుత్ర దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించాడు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.