హాట్ టాపిక్‌గా మారిన తమన్నా ‘స్త్రీ-2’ రెమ్యునరేషన్

హాట్ టాపిక్‌గా మారిన తమన్నా ‘స్త్రీ-2’ రెమ్యునరేషన్

Published on Aug 21, 2024 8:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ట్యాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ-2’. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ హార్రర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

ఈ స్పెషల్ సాంగ్ సినిమా విజయంలో కీలకంగా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ పాటలో తమన్నా చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసినందుకు తమన్నా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

‘స్త్రీ-2’లో స్పెషల్ సాంగ్ కోసం తమన్నా ఏకంగా రూ.కోటి చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్‌పై 5 నిమిషాలు కనిపించినందుకే తమన్నా ఇంతమొత్తంలో చార్జ్ చేయడం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్రేజ్ అలాంటిది కాబట్టి అంత మొత్తంలో చార్జ్ చేసిందని తమన్నా ఫ్యాన్స్ అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు