ఫోటో మూమెంట్: పెళ్లికి రెడీ అయిన ‘రాజావారు రాణీగారు’

ఫోటో మూమెంట్: పెళ్లికి రెడీ అయిన ‘రాజావారు రాణీగారు’

Published on Aug 21, 2024 12:35 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనదైన నటనతో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ హీరో తన పర్సనల్ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలపెట్టబోతున్నాడు. తాను నటించిన ‘రాజావారు రాణీగారు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరక్‌తో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాడు.

గతకొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు వీరు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలపెట్టగా, ఆగస్టు 22న వీరు తమ వివాహంతో ఒకటి కాబోతున్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో భాగంగా కిరణ్-రహస్య కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక వీరి పెళ్లి కర్ణాటకలోని కూర్గ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరుగుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ జంట తమ వివాహం చేసుకుంటున్నారు. దీంతో వారికి నెట్టింట పలువురు విషెస్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు