మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ బచ్చన్” రీసెంట్ గానే రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న 75వ చిత్రం షూటింగ్ లో తాను తీవ్ర గాయాలు పాలు అయ్యినట్టుగా వార్తలు బయటకి వచ్చాయి. అలాగే దీనితో పాటుగా ఒక షాకింగ్ పిక్ కూడా వైరల్ గా మారింది.
దీనితో రవితేజ అభిమానుల్లో మరింత కంగారు నెలకొనగా వారికి కొంచెం ఊరటనిచ్చే న్యూస్ ఇప్పుడు బయటకి వచ్చింది. అది కూడా రవితేజ నుంచే తన హెల్త్ అప్డేట్ రావడం విశేషం. తాను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక చిన్న సర్జరీ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను, మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ అందించినందుకు సంతోషంగా ఉంది.
మళ్ళీ తొందరలోనే కలుసుకునేందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నాను అంటూ రవితేజ తన అభిమానులకి తానే స్వయంగా అప్డేట్ ని అందించారు. దీనితో ఇప్పుడు అభిమానులు కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి మాస్ మహారాజ్ అతి త్వరలోనే కోలుకొని మళ్ళీ తన మార్క్ ఎనర్జీతో సినిమాలు చేయాలనీ ఆశిద్దాం.
Successfully discharged after a smooth surgery and feeling fine. Grateful for all your warm blessings and support ❤️????
Excited to be back on set soon ????
— Ravi Teja (@RaviTeja_offl) August 24, 2024