అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత డీవీవీ దానయ్య ఓజి చిత్రం గురించి ప్రస్తావించారు. అభిమానులు ఓజి…ఓజి…ఓజి అని అంటూ ఉండగా, “మొన్న మీ తరపున నాని గారు ప్రెస్ మీట్ లో అడిగేశారు. వెయిట్ చెయ్యండి. త్వరలోనే వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.