రిలయన్స్ గ్రూపు అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ కి, రాధికా మర్చంట్ తో జులైలో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ సెలబ్రిటీలలు హాజరు అయ్యారు. ఐతే, ఈ వివాహానికి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ దూరంగా ఉంది. కాగా తాను ఎందుకు దూరంగా ఉందో కంగనా తాజాగా స్పందించింది.
ఇంతకీ, కంగనా ఏం మాట్లాడింది అంటే.. ‘అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. నాకు పర్సనల్ గా ఫోన్ చేసి మరీ ఆయన తన పెళ్లికి పిలిచారు. ఐతే, అదే రోజున మా ఇంట్లో కూడా పెళ్లి ఉందని.. కాబట్టి నేను రాలేనని చెప్పాను. ఆ రోజు నా చిన్న సోదరుడు వివాహం జరిగింది. అలాగే, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వెడ్డింగ్స్‌లో పాల్గొనడం ఇష్టం ఉండదు. కేవలం నా కుటుంబ వేడుకల్లో మాత్రమే నేను ఇష్టంగా పాల్గొంటాను’ అని కంగనా చెప్పుకొచ్చింది.
కంగనా రనౌత్ నటించిన సరికొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తీసుకువస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించబోతుంది. అలాగే, మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అన్నట్టు ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది.