హీరోయిన్ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఐతే, అరెస్టయిన దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. పైగా ఓ ఫోటో కూడా లీక్ అయ్యింది. తాజాగా ఆ వార్తలకు ఇంకా బలం చేకూరుస్తూ ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.
పైగా ఆ వీడియో కాల్ లోని వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడినట్లు తెలుస్తోంది . 25 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో వైరల్గా మారడంతో కన్నడ పోలీసులకు పెద్దతలనొప్పిగా మారింది. మొత్తమ్మీద జైల్లో కూడా దర్శన్ రాచమర్యాదలు అందుకోవడం నిజంగా విశేషమే. ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు.