నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ పాల్గొన్నారు. ఐతే, ఈ పాడ్ కాస్ట్ లో ఆమిర్‌ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎంతో మారుతూ ఉంది. జంటలు విడిపోతున్నారు. మరి వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ? అని రియా చక్రవర్తి ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా కష్టమైన ప్రశ్న. వైవాహిక బంధానికి సంబంధించి నేను రెండుసార్లు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడమే మంచిది అని నా అభిప్రాయం. ఇక నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా’ అని ఆమిర్‌ఖాన్ తెలిపారు.
ఆమిర్‌ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒకరితో కలిసి ఉండటం.. ఇష్టాయిష్టాలు, కష్ట సుఖాలు వారితో పంచుకోవడం నాకు ఇష్టం. నా మాజీ సతీమణులు రీనా, కిరణ్‌తో నాకెంతో మంచి రిలేషన్ ఉంది. నా దృష్టిలో ఇప్పటికీ, మేమంతా ఒకే కుటుంబం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి వైవాహిక బంధం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది మనం ఎలా చెప్పగలం?’’ అని ఆమిర్‌ఖాన్ చెప్పుకొచ్చారు.