పెళ్లిళ్ల పై నరేశ్ సరదా కామెంట్స్

పెళ్లిళ్ల పై నరేశ్ సరదా కామెంట్స్

Published on Aug 26, 2024 3:30 PM IST

సీనియర్ నటుడు వీకే నరేశ్ పెళ్లిళ్ల టాపిక్ మళ్లీ వైరల్ గా మారింది. నటి పవిత్రా లోకేశ్‍ను నరేశ్ గతేడాది నాలుగో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన మూడో భార్య రమ్యా రఘుపతి అడ్డుపడేందుకు ప్రయత్నించడంతో అది అప్పట్లో పెద్ద వివాదం అయ్యింది. అయితే, నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నరేశ్‍కు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నరేశ్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

ఇంతకీ, నరేశ్ ఏం చెప్పాడంటే.. “ఇప్పటి తరం అసలు పెళ్లి వద్దని. ఇంతకు ముందు తరాలు మరొక్కసారి ట్రై చేద్దామని.. ఎందుకోసం ఇది.. హ్యాపీ ఉండడానికే కదా.” అని నరేశ్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ కి అందరూ గట్టిగా నవ్వారు. కాగా సుందరకాండ సినిమాలో నారా రోహిత్, నరేశ్‍తో పాటు శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వర్గనీ, వాసుకీ ఆనంద్ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు