న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే, ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నానికి ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించే సినిమాలకు అక్కడి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను అందిస్తుంటారు. అయితే, ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్ర ప్రీమియర్లకు అక్కడ సాలిడ్ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 17000కు పైగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.
ప్రీమియర్లకే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడు కావడంతో, ఈ సినిమాకు అక్కడ ఎలాంటి భారీ రెస్పాన్స్ లభిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా, ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.