ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో సాలిడ్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం “సరిపోదా శనివారం” అని చెప్పాలి. నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం తన కెరీర్ లో సాలిడ్ వసూళ్లు అందుకుంది.
అయితే ఈ చిత్రం ఈ రేంజ్ లో రావడానికి కారణమైన ‘మెన్’ తో నాచురల్ స్టార్ నాని పోస్ట్ చేసాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ సహా సరిపోదా శనివారం తెరకెక్కించడానికి దోహదపడిన తమ మెన్స్ గ్యాంగ్ తో కలిసి ఫోటోకి పోజ్ ఇచ్చాడు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో విలన్ గా ఎస్ జె సూర్య నటించగా సాయి కుమార్, మురళీ శర్మ తదితరులు నటించారు. అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.