అంతిమంగా సినిమా బతకాలి – మమ్ముట్టి

అంతిమంగా సినిమా బతకాలి – మమ్ముట్టి

Published on Sep 1, 2024 9:13 PM IST

జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా బయట పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నటులు – దర్శకనిర్మాతల చీకటి విన్యాసాలు బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హేమ కమిటీ రిపోర్ట్‌ ను ఉద్దేశించి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

మమ్ముట్టి తన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ పెడుతూ.. ‘సెట్‌లో నటీమణులకు ఇబ్బందికర ఘటనలు జరగడం బాధాకరం. అలాంటివి జరగకుండా దర్శక నిర్మాతలే జాగ్రత్తలు తీసుకోవాలి. సినీ పరిశ్రమ గురించి అధ్యయనం చేసి, నివేదికను సిద్ధం చేసి, పరిష్కారాలను సూచించడానికి ప్రభుత్వం జస్టిస్‌ హేమ కమిటీని ఏర్పాటు చేయడం మంచి పరిణామం. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, పరిష్కారాలను హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాను.

ఐతే, వాటిని అమలు చేసేందుకు చిత్ర పరిశ్రమలోని అన్ని అసోసియేషన్స్‌ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకు, ఇదే సరైన సమయం. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులపై పోలీసుల విచారణ చేస్తున్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక పూర్తి వెర్షన్ కోర్టు ముందు ఉంది. కాబట్టి, దర్యాప్తు జరగనివ్వండి. నిందితులకు తగిన శిక్షలను న్యాయస్థానం నిర్ణయిస్తుంది. సినీ పరిశ్రమలో ‘పవర్‌ సెంటర్‌’ అనేది లేదు. అంతిమంగా సినిమా అనేది బతకాలి’ అని మెగాస్టార్ మమ్ముట్టి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు