బాలయ్య బాబు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ‘నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. బాలయ్య నట జీవితం గురించి, బాలయ్యతో తమకున్న అనుబంధం గురించి వారంతా తెలియజేశారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ వీడియో బైట్ లో మాట్లాడుతూ.. ‘సంస్కారం వల్ల అందరూ గుర్తు పెట్టుకునే వ్యక్తి బాలయ్య బాబు. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఎన్టీఆర్ గారే. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బాగుండాలని కోరుకుంటున్నాను; అని కమల్ హాసన్ తన వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చారు.
అదేవిధంగా కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ… ‘బాలకృష్ణ గారు నాకు సోదరుడిలాంటివారు. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఒకప్పుడు మేమంతా చెన్నైలో కలిసి ఉండేవాళ్లం. మీరు ఇలాగే 100 ఏళ్ల వేడుకలూ చేసుకోవాలి’ అని శివ రాజ్‌కుమార్ చెప్పారు.
అలాగే మరో సీనియర్ హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి బాలకృష్ణ గారు. బాలయ్యకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల మీ ప్రయాణం ఎంతో మంది కొత్తవారికి ఆదర్శం’ అని బాలయ్యని చూస్తూ వెంకటేశ్ చెప్పారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ… ‘బాలయ్య బాల్యం నుంచీ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. 500 రోజులకుపైగా సినిమా ప్రదర్శితమవడమనే ఘనత ఆయనదే. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం సంతోషంగా ఉంది’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.